ఏపి సియంకు కౌలు రైతుల సంఘం లేఖ

jagan mohan reddy
jagan mohan reddy, ap cm

విజయవాడ: వ్యవసాయ రంగంలో ప్రస్తుతం కౌలు వ్యవసాయమే ప్రాధాన్యత సంతరించుకుందని, కౌలు రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఏపి కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు రాసిన లేఖలో కోరారు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులున్నారని, అన్ని పంటల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ కౌలు వ్యవసాయం విస్తరిస్తుందని, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు వారిని ఆదుకునే వారు లేక, చట్టాలు అమలు చేసే వారు లేక కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు. వ్యవసాయ పథకాలు, రాయితీలు గురించి సమీక్ష జరిపేప్పుడు కౌలు రైతులకు కూడా ఇవ్వాలనే ఆలోచనే రావడం లేదని లేఖలో పేర్కొన్నారు. గతంలో జరిగిన రుణమాఫీలో కౌలురైతులు దగాపడ్డారని, కౌలు రైతుల రక్షణ, సంక్షేమం జరగాలన్నా, వ్యవసాయం లాభసాటిగా మార్చాలన్నా, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తే ఏ ఒక్క శాఖాధికారులు, మంత్రులు లేరని పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కౌలు రైతులకు మాత్రం అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/