తండ్రికి తగ్గ తనయుడు సిఎం జగన్‌

Lakshmi Parvathi
Lakshmi Parvathi


గుంటూరు: వైఎస్‌ఆర్‌సిపి నేత నందమూరి లక్ష్మీపార్వతి ఏపి సిఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దివంగత వైఎస్‌ఆర్‌ను మరిపించేలా జగన్‌ సుపరిపాలన అందించడం ఖాయమని ఆమె అన్నారు. వైఎస్‌ఆర్‌ వారసుడిగా జగన్‌కు ఆ సమర్థత ఉందని, అన్ని వర్గాలను జగన్‌ సమన్వయం చేసుకుంటూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ఈసారి ఎన్నికల్లో ప్రజలు జగన్ పేర్కొన్న నవరత్నాలకు విపరీతంగా ఆకర్షితులయ్యారని, అవే వైఎస్‌ఆర్‌సిపిని గెలిపించాయని లక్ష్మీపార్వతి తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/