గవర్నర్‌తో కేవిపి రామచంద్రరావు సమావేశం

KVP ramachandra rao
KVP ramachandra rao

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవిపి రామచంద్రరావు గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టుపై గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చారు. తమ వ్యక్తిగత రాజకీయాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని, పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభజన చట్టాన్ని ఉల్లంఘించాయని, పోలవరం పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలని గతంలో యూపిఏ ప్రభుత్వం నిర్ణయించిందని కాంగ్రెస్‌ నేత కెవిపి గుర్తుచేశారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/