సొంత గూటికి కర్నూలు సిటీ ఎమ్మెల్యే

sv mohan reddy
sv mohan reddy


క‌ర్నూలుః కర్నూలు సిటీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారు. 2014 ఎన్నికల అనంతరం వైఎస్ఆర్‌సిపిని వీడిన ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన మళ్లీ సొంతగూటికి వెళ్లాలని నిర్ణయించారు. రాజకీయ భవిష్యత్తుపై మోహన్ రెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కర్నూలు నగరాన్ని ఏంతో అభివృద్ధి చేశానన్నారు. టీజీ వెంకటేష్ చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధి పనులు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదని ఎస్వీ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులకు టికెట్లు అమ్ముకునే వ్యవస్థలో రాజకీయాలు చేయడం కష్టమన్నారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను , తనను భారీ మోసంతో బయటికి పంపారని ఆయన ఆరోపించారు. చేసిన తప్పును సరిదిద్దుకుని వైఎస్ఆర్‌సిపిలో చేరుతానని ఎస్వీ మీడియాకు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా వైఎస్ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎం అవుతారన్నారు.