సిఎం జగన్‌కు కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి హితవు

పాలనా విధానాలపై తీవ్ర విమర్శలు

Kotla Jayasurya Prakasha Reddy
Kotla Jayasurya Prakasha Reddy

అమరావతి: ఏపి సిఎం జగన్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి తనయుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి హితవు పలికారు. పాలనా విధానాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన తీరు మార్చుకోవాలని, లేదంటే మరోసారి గెలవడం కష్టమని ఆయన అన్నారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకత ఉండాలని సూచించారు. ఐదెకరాల భూమి ఉందనో, కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చిందనో పథకాలను నిలిపివేస్తే నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఆదాయ వనరులు, అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై పార్లమెంటులో మద్దతు పలికిన వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్రానికి వచ్చేసరికి ముస్లింలను తప్పుతోవ పట్టిస్తోందని ఆరోపించారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపైనా కోట్ల విమర్శలు గుప్పించారు. బిజెపి విధానాలన్నీ ప్రజల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/