ఈతకు వెళ్లి విశాఖ యువకుడి మృతి

koona avinash
koona avinash

న్యూజెర్సీ: విశాఖకు చెందిన కూన అవినాష్‌(32) అమెరికాలోని న్యూజెర్సీలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న కూన వెంకట్రావు కుమారుడు కూన అవినాష్‌ అమెరికాలో యూనియన్‌ పోస్టల్‌ సర్వీసెస్‌లో సీనియర్‌ సిస్టమ్‌ ప్రోగ్రామర్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 1వ తేదీ శనివారం కావడంతో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. స్థానిక నదిలో ఈతకు దిగి అవినాష్‌ ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టిన సిబ్బంది భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మతదేహం లభించింది. మృతేదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టరుకు వినతి పత్రం అందించినట్లు నాయకులు చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/