కోడెలను అవమానించింది చంద్రబాబే

AP Minister Kodali Nani
AP Minister Kodali Nani

Amaravati: కోడెల శివప్రసాదరావును అవమానించింది చంద్రబాబేనని మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కోడెల ఆత్మహత్య దురదృష్టకరమన్నారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. కోడెలకు ఇబ్బందులెదురైతే చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. వైసీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే అనర్హత వేటు వేయకుండా చంద్రబాబుకు కోడెల సహకరించారు. చంద్రబాబుకు ఇంత చేసినా తనను పట్టించుకోలేదని కోడెల మనస్తాపం చెందారన్నారు. ఆలపాటి రాజాకు మంత్రి పదవి ఇచ్చి కోడెలను చంద్రబాబు పక్కనపెట్టారని, కోడెలకు నర్సరావుపేట సీటు ఇవ్వకుండా సత్తెనపల్లినుంచి పోటీ చేయించారన్నారు. కోడెలకు మంత్రి పదవి ఇవ్వకుండా తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్‌ను చేశారు. అసెంబ్లీ ఫర్నిచర్‌ తీసుకెళ్లి వాడుకున్నట్టు స్వయంగా కోడెల ప్రకటించారు. వైసీపీ బాధితుల క్యాంపునకు రాకుండా ఎందుకు అడ్డుకున్నారని కొడాలి నాని ప్రశ్నించారు.