ఓ నిర్ణయం తీసుకోవాల్సింది వంశీనే

వంశీతో చర్చించిన కేశినేని నాని

kesineni nani
kesineni nani

విజయవాడ: గన్నవరం టిడిపి ఎమ్మెల్యెవల్లభనేని వంశీ కొన్ని రోజుల క్రితం పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వంశీ వైఎస్‌ఆర్‌సిపిలో చేరడానికి సిద్ధమయ్యారంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఆయనతో టిడిపి ఎంపీ కేశినేని నాని చర్చించారు. ఈ విషయంపై కేశినేని మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా రాటుదేలడానికి పోరాడాల్సి ఉంటుందని, ఒత్తిళ్లు ఎదుర్కోవడం సహజమని వ్యాఖ్యానించారు. వీటన్నింటినీ పోరాడి, గెలిచిన వ్యక్తి ఇప్పుడు వెన్ను చూపడం సరికాదని అన్నారు. ఆయనకు తాము చెప్పాల్సింది చెప్పామని తెలిపారు. వంశీ ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని కేశినేని నాని తెలిపారు. ఆయనే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. వంశీకి టిడిపి ఎంత అవసరమో, టిడిపికి కూడా ఆయన అంతే అవసరమని వ్యాఖ్యానించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/