కర్తవ్య నిర్వహణలో సహాయ సహకారాలు అందిస్తాం

KCR, ts cm
KCR, ts cm

విజయవాడ: ఏపి సియంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా తెలంగాణ సియం కేసిఆర్‌ మాట్లాడుతూ..ఏపి సియంగా బాధ్యతలు చేపట్టిన జగన్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు. వయసు చిన్నదే కాని బాధ్యత పెద్దది. బాధ్యతలను అద్భుతంగా నిర్వహించగలిగిన శక్తి, సామర్థ్యం ఉందని గత తొమ్మిదేళ్లలో నిరూపించారు. రెండు రాష్ట్రాల ప్రజలు ఆత్మీయతతో పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధి చెందాలి. గోదావరి జలాల వినియోగం వంద శాతం జరగాలి. కర్తవ్య నిర్వహణలో సహాయ సహకారాలు, అండదండలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. జగన్‌కు ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. మీ నాన్నగారి పేరును నిలబెట్టాలి. మూడు..నాలుగు టర్మ్‌ల వరకు మీ పరిపాలన సాగాలని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/