ఏపి సియం జగన్‌తో కేసిఆర్‌ సమావేశం

KCR, jagan
KCR, jagan


అమరావతి: ఏపి సియం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో తెలంగాణ సియం కేసిఆర్‌ సమావేశమయ్యారు. ఈ రోజు విజయవాడ చేరుకున్న కేసిఆర్‌ తొలుత దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం నేరుగా తాడేపల్లిలో జగన్‌ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసిఆర్‌, కేటిఆర్‌, ఇతర నేతలకు జగన్‌ స్వాగతం పలికారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులూ పలు సమస్యలపై చర్చించనున్నారు. విభజన చట్టంలోని పరిష్కారానికి నోచుకోని అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలు, విద్యుత్‌ బిల్లుల బకాయిలు తదితర అంశాలపై ఇరువురు సియంలు చర్చించే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదం పరిష్కారంపైనా ఈ భేటిలో చర్చించనున్నారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఈ సందర్బంగా కేసిఆర్‌ జగన్‌ను ఆహ్వానించనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/