బిజెపియేతర పక్షాల భేటికి కెసిఆర్‌, జగన్‌లకు ఆహ్వానం?

kcr, Jagan
kcr, Jagan

హైదరాబాద్‌: యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నేతృత్వంలో మే 23వ తేదీన ఢిల్లీలో నిర్వహించే బిజెపియేతర పక్షాల భేటికి తెలుగు రాష్ట్రాల నుండి తెలంగాణ సిఎం కెసిఆర్‌, ఏపి విపక్ష నేత జగన్‌కి ఆహ్వానాలు అందాయట అయితే ఈ సమావేశనకి వీరిని ఆహ్వానిస్తూ సోనియా గాంధీ స్వయంగా లేఖలు రాశారని సమాచారం. మే 23వ తేదీనే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నందున అధికార బీజేపీకి ఫలితాలు అనుకూలంగా లేకపోతే భవిష్యత్తు కార్యాచరణకు ఈ సమావేశం దిశానిర్దేశం చేసేలా ఉండాలనేది సోనియా ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఇటు యూపీయే, అటు ఎన్టీయేలో భాగస్వాములుకాకుండా తటస్థంగా ఉన్న పార్టీలు సమావేశానికి హాజరు కావాలని సోనియా ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే టిడిపితో పాటు టిఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సిపిలకు కూడా ఆహ్వానాలు అందినట్లు సమాచారం. అయితే బీజేపీయేతర పక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్‌తో కలిసి కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో కలిసి సమావేశంలో పాల్గొనేందుకు సిఎం కెసిఆర్‌, జగన్‌లు అంగీకరిస్తారా? లేదా అనేది ఇప్పుడు చర్చినియాంశంగా మారింది.

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/