శ్రీవారిని దర్శించుకున్న కుమారస్వామి

Kumaraswamy
Kumaraswamy

తిరుమల: కర్ణాటక సిఎం కుమారస్వామి ఈరోజు తిరుమల శ్రీవారినిదర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుమారస్వామి,మాజీ ప్రధాని దేవెగౌడ, మంత్రి రేవన్న శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవెగౌడ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. తాము కాంగ్రెస్‌ పార్టీతోనే ఉంటామని, కర్ణాటకలో కాంగ్రెస్‌ కూటమి 18సీట్లు గెలుస్తుందని ఈసందర్భంగా కుమారస్వామి తెలిపారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/