ఏపి సిఎం జగన్‌కు కన్నా లేఖలు

Kanna Lakshminarayana
Kanna Lakshminarayana

అమరావతి: బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ ఏపి సిఎం జగన్‌కు 7 లేఖలు రాశారు. ఆ లేఖల్లో .. రాజధాని భూముల అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోలులో.. అక్రమాలపై విచారణ జరిపించి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానంపై ఆలోచన చేయాలని కోరారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేలా కొత్త పాలసీ తేవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో నిర్వాసితులకు న్యాయం చేయాలని కన్నా డిమాండ్ చేశారు. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో తొలగించిన.. హిందూ దేవాలయాలను పునర్మించాలని కన్నా లేఖలో సిఎం జగన్‌ను కోరారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/