మాజీ సీఎంను గుంతల రోడ్లపై తిప్పడం దుర్మాగం

Kala Venkata Rao
Kala Venkata Rao

అమరావతి: జడ్‌ ప్లస్‌ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గుంతల రోడ్లపై తిప్పడం దుర్మార్గమని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ అన్నారు. రైతులను పరామర్శించి వెళ్దామని చంద్రబాబు అనుకోవడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, ఎంపీ గల్లా జయదేవ్‌ అరెస్టు హేయమైన చర్య అని కళా వెంకట్రావ్‌ దుయ్యబట్టారు. ఎంపీ గల్లా జయదేవ్‌ పట్ల పోలీసులు అమానుషంగా ప్రవిర్తించారని వైఎస్సాఆర్‌సిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. తన నియోజకవర్గంలో రైతుల కష్టాలు ఎంపీ తెలుసుకునే హక్కు లేదా? అని ప్రశ్నించారు. ఒక ప్రజాప్రతినిధికి గాయాలయ్యేట్లు పోలీసులు ప్రవర్తిస్తారా అని రాష్ట్రా ప్రభుత్వాన్ని కళా వెంకట్రావ్‌ నిలదీశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/