ఏపీ హైకోర్టు సీజేగా జితేంద్ర కుమార్ మహేశ్వరి ప్రమాణ


ప్రమాణం చేయించిన గవర్నర్
కార్యక్రమానికి హాజరైన జగన్

Jitendra Kumar Takes Oath As AP High Court CJ
Jitendra Kumar Takes Oath As AP High Court CJ

అమరావతి: ఏపిహైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మహేశ్వరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సీజేగా బాధ్యతలు తీసుకున్న మహేశ్వరిని, వైఎస్ జగన్ అభినందించారు. అనంతరం గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు మహేశ్వరి, జగన్ తో పాటు ఆహూతులు హాజరయ్యారు.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/