టిడిపిలో చేరిన వైఎస్‌ఆర్‌సిపి నేత సియ్యారి దొన్నుదొర

TDP, YSRCP
TDP, YSRCP

గుంటూరు: టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు గుంటూరులో పర్యటించారు. ఈ సదర్భంగా వైఎస్‌ఆర్‌సిపి నేత దొన్నుదొరను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. ఏపీలో సిమెంట్ బస్తా ధర కంటే ఇసుక బస్తా ధర అధికంగా ఉందని చంద్రబాబు దుయ్యబట్టారు. టీడీపీపై నమ్మకంతోనే సియ్యారి దొన్నుదొర పార్టీలో చేరారని వ్యాఖ్యానించారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిన ఘనత తమదేనని చంద్రబాబు పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అరకు అసెంబ్లీ సీటు నుంచి వైసీపీ రెబెల్ గా పోటీచేసిన దొన్నుదొర రెండో స్థానంలో నిలిచారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/