రాజకీయాలకు శాశ్వతంగా స్వస్తి

JC diwakar reddy
JC diwakar reddy

అనంతపురం: సీనియర్‌ నేత, మాజీ ఎంపి జేసి దివాకర్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం అనంతపురంలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ..తన రాజకీయ జీవితంలో సహకరించిన పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. తన తండ్రి సంజీవ్‌రెడ్డి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని, కానీ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తప్పుకోవాలని భావిస్తున్నట్లు జేసి వెల్లడించారు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదన్నారు. ఐతే ఎన్నికల సంఘంలో మార్పులు చేయాల్సిన అవసరముందని జేసి అభిప్రాయపడ్డారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/