వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఓటు వేయండి

J.C. Diwakar Reddy
J.C. Diwakar Reddy

అనంతపురం: టిడిపి ఎంపి జేసీ దివాకర్‌ రెడ్డి ఏపి సిఎం చంద్రబాబుకు షాక్‌ ఇచ్చాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపురంలో జేసీ మాట్లాడుతు..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాక ప్రజలంతా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన తనకు ఆ పార్టీపై మమకారం ఇంకా చావలేదన్నారు. అందుకే తాను ఇలా మాట్లాడుతున్నానని తన మనసులోని మాటను చెప్పారు. హిందీ రాకపోవడం వల్ల ఎంపీగా ఫెయిల్‌ అయ్యానని అంగీకరించారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/