జయదేవ్‌ అసక్తికర వ్యాఖ్యలు

గుంటూరు: గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ గుంటూరు ఎంపీ సీటుపై మోదుగుల కన్నేశాడని తెలిసిందని,అయనకు దమ్మంటే తనపై గెలవాలని సవాల్‌ విసిరారు.మోదుగుల మొదటి నుండి తనకు గౌరవం ఇచ్చేవాడు కాదని ,ప్రభుత్వ కార్యక్రమాల్లో తన పేరు కూడా ప్రస్తావించేవాడు కాదని గల్లా వ్యాఖ్యానించడం గమనార్హం.