కెసిఆర్‌ పై జయదేవ్‌ ఫైర్‌

గుంటూరు: నేడు గల్లా జయదేవ్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ టీడీపీ డేటా చోరీ విషయమై తెలంగాణ సీఎం కెసిఆర్‌ పై నిపూలు చెరిగారు. కెసిఆర్‌ ఏపీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని అరోపించారు.ప్రధాని మోదీని ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని, మోదీ పాలసీలు, మాటలు నమ్మి మోసపోయామని అన్నారు. కశ్మీర్ పరిస్థితులను మోదీకి అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే మోదీకి ఓటేసినట్లేనని అన్నారు. జగన్ సీఎం అయితే ఆయన స్విచ్ తెలంగాణలో, ఫ్యూజ్ ఢిల్లీలో ఉంటుందని విమర్శించారు.