వైఎస్‌ఆర్‌సిపిపై జనసేన ఫిర్యాదు?

janasena
janasena

అమరావతి: సామాజిక మాధ్యమాల్లో వైఎస్‌ఆర్‌సిపి అవాస్తవాలు ప్రచారం చేస్తోందని జనసేన ఆరోపించింది. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి సోషల్‌ మీడియా విభాగంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, లీగల్‌ నోటీసులు పంపుతామని ఆ పార్టీ ముఖ్యనేతలు పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సూచించినట్లు వారు చెబుతున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/