శబరిమలలో మహిళల ప్రవేశంపై పవన్‌ ఆసక్తికర సందేశం!

Pawan Kalyan
Pawan Kalyan

తిరుపతి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తిరుపతిలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిదే. కాగా ఈ సమావేశంలో పవన్‌ శబరిమలలో మహిళల ప్రవేశంపై ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన భార్య లెజినోవో శబరిమలకు తానెందుకు వెళ్లకూడదని తనను ప్రశ్నించిందని అన్నారు. దానికి సమాధానంగా నువ్వు చర్చికి వెళ్లినప్పుడు తలపై చీరను ఎందుకు కప్పుకున్నావు అని అడిగానని అందుకు తను అది తమ సంప్రదాయమని చెప్పగా, తాను బదులుగా ప్రతీ ధర్మానికి ఒక ఆచారం ఉంటుందని, అయ్యప్ప బ్రహ్మచారి, నిత్యం ఆయన తపస్సులోనే ఉంటారని చెప్పానన్నారు. ఆ తపస్సు కారణంగా ఆయన మహిళలను చూడరని ఆ కారణంగానే మహిళలకు శబరిమల ప్రవేశం లేదని వివరించానని పవన్‌ తన కార్యకర్తలకు తెలిపారు. రెచ్చగొట్టే భావజాలంతో కొందరు కోర్టులను ఆశ్రయించారని, తన తల్లి కూడా ఆలయ వివాదంపై ఆవేదన వ్యక్తం చేశారని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/