బిఎస్పీతో కలిసి జనసేన పోటీ

mayawati, pawan kalyan
mayawati, pawan kalyan


లక్నో: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిఎస్పీతోనూ కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వెళ్లిన పవన్‌..బిఎస్పీ అధినేత్రి మాయావతితో భేటి అయ్యారు. ఎన్నికల్లో పొత్తుపై ఆమెతో చర్చించారు. అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు. అంబేడ్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని..మాయావతి మార్గనిర్ధేశకత్వం చాలా అవసరమని పవన్‌ అభిప్రాయపడ్డారు. సామాజికి న్యాయం అందరికీ అందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి వెళ్తామని ఇది వరకేఏ పవన్‌ ప్రకటించారు. తాజాగా బిఎస్పీతోనూ కలిసి ఎన్నికల బరిలోకి వెళ్తున్నట్లు చెప్పారు.