కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా

  • వైఎస్ కుటుంబానికి విధేయుడిగా జక్కంపూడి
Jakkampudi-raja
Jakkampudi-raja

అమరావతి: ఏపి సిఎం జగన్‌ రాజానగరం ఎమ్మెల్యె జక్కంపూడి రాజాను ఏపీ కాపుల సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఈ మేరకు ఆర్టీ 234 నంబర్ తో ప్రభుత్వ ఉత్తర్వులు(జీవో) జారీచేశారు. ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజా రెండేళ్ల పాటు కొనసాగుతారని ప్రభుత్వం తెలిపింది.ఈ నేపథ్యంలో రాబోయే ఐదేళ్లకు గానూ ప్రభుత్వం కాపుల కోసం రూ.10,000 కోట్లు వెచ్చించనుంది. ఈ గురుతర బాధ్యతను జగన్ జక్కంపూడి రాజాకు అప్పగించారు. జక్కంపూడి రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా పేరు పొందారు.


తాజా నాడీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health