ప్రవాసాంధ్రులకు మెరుగైన సేవలు

Jake dainarman

Tadepalle: ప్రవాసాంధ్రులకు మెరుగైన సేవలు అందించటానికి అమెరికా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అమెరికన్‌ సిటిజెన్‌ సర్వీసెస్‌ వైస్‌ కాన్సుల్‌ జేక్‌ డైనర్‌మాన్‌ అన్నారు. తాడేపల్లిలోని ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ను ఆయన సందర్శించారు. అనంతరం ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడు వెంకట్‌ ఎస్‌ మేడపాటితో జేక్‌ డైనర్‌మాన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్మార్ట్‌ ట్రావెలర్‌ నమోదు కార్యక్రమం, అమెరికాలో విద్య అవకాశాలు, కాన్సుల్‌ వ్యవహారాల బ్యూరో, అంతర్జాతీయంగా పిల్లల అపహరణను నిరోధించడం, సిటిజెన్‌ సేవలు తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడు వెంకట్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ ద్వారా అందిస్తున్న ప్రవాసాంధ్ర భరోసా, భీమా, పెట్టుబడి వ్వవహారాలకు సంబంధించిన సేవలు గురించి చెప్పారు. ఈ కార్యక్రమంలో కాన్సుల్‌ అసిస్టెంట్‌ మానస గొండేలా పాల్గొన్నారు.