వెంకయ్యనాయుడుపై జగన్‌ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి

Vishnuvardhan Reddy
Vishnuvardhan Reddy

విశాఖపట్టణం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఏపి బిజెపి నేత విష్ణువర్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలుగు భాష పట్ల వెంకయ్యనాయుడు ఎంత అనురక్తి ప్రదర్శిస్తారో అందరికీ తెలుసని, అలాంటి వ్యక్తిపై జగన్‌ అసంబద్దంగా వ్యాఖ్యాలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక సమస్య నుంచి అందరి దృష్టి మరల్చడానికే జగన్‌ ఇతరులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితం పై జగన్‌ విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇంకా తెలుగు అధికార భాషా సంఘం తీసేసి ఆంగ్ల అధికార భాష సంఘం పెట్టుకోవాలని సూచించారు. జగన్‌ ఇగోల కోసం అధికారులను మార్చేస్తున్నారని విష్ణువర్దన్‌ రెడ్డి ఆరోపించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై విమర్శలు చేసి వైఎస్‌ఆర్‌ సిపి ప్రభుత్వం సమస్యలను కొని తెచ్చుకుంటుందని విష్ణువర్దన్‌ రెడ్డి అన్నారు.
తాజా జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/