శనివారం నుంచే సచివాలయానికి జగన్‌

jagan
jagan

అమరావతి: నవ్యాంధ్రకు రెండో సియంగా జగన్‌ ఈ 30న ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన ప్రమాణం స్వీకారం అనంతరం మోది ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత శనివారం నుంచే సచివాలయంలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సియం ఛాంబర్‌, కేబినెట్‌ హాల్‌, హెలిపాడ్‌, సియం కాన్వా§్‌ు రూట్‌లను ఆ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. జగన్‌ నేమ్‌ ప్లేట్‌ను కూడా సుబ్బారెడ్డి పరిశీలించి ఆమోదించారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈనెల 30న తేదీన వైఎస్‌ జగన్‌ సియంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రమాణస్వీకారానికి వచ్చే నేతలకు, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/