వైవిని పెద్ద‌ల స‌భ‌కు పంపాలని జగన్‌ నిర్ణయం!

y v subba reddy, jagan
y v subba reddy, jagan

అమరావతి: మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి విషయంలో వైఎస్‌ఆర్‌సిపి ఏపి సియం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటును కేటాయించాలని జగన్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ఐదేళ్ల లోపు వైఎస్‌ఆర్‌సిపి ఎన్డీయేలో చేరితే వైవి సుబ్బారెడ్డికి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కే అవకాశముంది. 2019 ఎన్నికల్లో ఎంపి టికెట్‌ ఇవ్వకపోవడంతో మొదట్లో అలకబూనిన వైవి సుబ్బారెడ్డి జగన్‌ హామీతో ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్‌ఆర్‌సిపి గెలుపు బాధ్యతలను తీసుకున్నారు. తాజాగా ఆయనను రాజ్యసభ ఎంపిగా పార్లమెంటుకు పంపాలని జగన్‌ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం వైఎస్‌ఆర్‌సిపిలో జోరుగా సాగుతుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/