ఏపి ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణం

jagan
jagan

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వై.ఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
వైఎస్‌ఆర్‌సిపి శ్రేణుల సమక్షంలో నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ జగన్‌తో ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమానికి తెలంగాణ సిఎం కెసిఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. తల్లి విజయమ్మ, సతీమణి భారతి, కుమార్తెలు హర్ష, వర్ష, వైఎస్‌ఆర్‌సిపి నేతలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వైఎస్‌ఆర్‌సిపి అభిమానులు తరలివచ్చారు. స్టేడియంలోపలికి రాలేకపోయిన అభిమానులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా 14 ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. జగన్‌ సభాస్థలికి చేరుకున్న సమయంలో వైఎస్‌ఆర్‌సిపి నేతలు హెలికాప్టర్‌ ద్వారా పూలు జల్లుతూ అభిమానాన్ని చాటుకున్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/