ఏపి అసెంబ్లీలో కరువుపై చర్చ

గడువులోగా చెల్లిస్తే వడ్డీ ఉండదు
గత ప్రభుత్వం వల్లే ఇదంతా

cm jagan
cm jagan

అమరావతి: ఏపి అసెంబ్లీలో కరవు పై చర్చ జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై సిఎం జగన్‌ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆశించినంతగా వర్షాలు పడలేదని 48 శాతం వర్షపాతం లోటుగా ఉందని ఆయన చెప్పుకోచ్చారు. అయితే జులై రెండోవారం వచ్చినా ఇంకా విత్తనాలు వేసే పరిస్థితి లేదన్నారు. కాగా మేం అధికారంలోకి వచ్చి కేవలం 2 నెలలు మాత్రమే అవుతున్న కరువు పరిస్థితులు ఎదుర్కొనుందుకు చర్యలు చేపడుతున్నామని జగన్‌ అన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదని విమర్శలు చేశారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో తీవ్ర కరువు వచ్చిందన్నారు.
టిడిపి ప్రభుత్వం విత్తనాల సేకరణ చేయలేదు. ఏప్రిల్‌ నాటికి సేకరణ పూర్తికావాలి మే నాటికి పంపిణీ ప్రారంభం కావాలి. జూన్‌లో మేం అధికారంలోకి వచ్చాం మేం వచ్చేసరికి విత్తనాల సేకరణ పూర్తయి ఉంటే రైతన్నలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉండేది కాదు అని సిఎం జగన్‌ అన్నారు.


పంటరుణాలు తీసుకున్న రైతులు గడువులోగా చెల్లిస్తే వడ్డీ ఉండదు. వడ్డీ వ్యాపారుల నుంచి రైతులను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. 60 శాతం ఫీడర్లలో రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్‌ ఇస్తున్నాం. వచ్చే జూన్‌ నాటికి 40 శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటల విద్యుత్తు ఉంటుంది. 40 శాతం ఫీడర్లలో 9 గంటల విద్యుత్తు సరఫరాకు రూ.1700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం తీసుకొచ్చాం. 55 లక్షల మంది రైతుల కోసం రూ.2,604 కోట్ల బీమాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ఆయిల్‌పామ్‌ రైతులకు అదనపు మద్దతు ధర కల్పిస్తూ రూ.80 కోట్లు విడుదల చేస్తాం. దీని ద్వారా 1.1లక్షల మంది రైతులకు లబ్ధి కలుగుతుందిగగ అని సీఎం అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/