‘ఈ ఈవిఎంలతోనే 2014లో చంద్రబాబు గెలుపు’

jagan mohan reddy
jagan mohan reddy, ysrcp president

హైదరాబాద్‌: ఈ రోజు వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ గవర్నర్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిసిన విషయం తెలిసిందే. అనంతరం మీడియాతో జగన్‌ మాట్లాడుతూ..ఎంపీలతో కూడిన తమ పార్టీ బృందం ఢిల్లీలో సోమవారం ఎన్నికల సంఘాన్ని కలిసిందని, మళ్లీ అవే అంశాలను ఇక్కడ గవర్నర్‌ దృష్టికి తీసుకువచ్చినట్లు వివరించారు.
ఐనా ఏపిలో 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు గెలిచింది ఇదే ఈవిఎంలతో కాదా అని ప్రశ్నించారు. అప్పుడు వివి ప్యాట్లు లేవు, అప్పుడు ఓటు ఎవరికి వేశామో కూడా తెలియని పరిస్థితి. ఐనా తాము ఈవిఎంల తీరుపై ఫిర్యాదు చేయలేదని, ఇప్పుడు వివిప్యాట్లు వచ్చాయి. ఎవరికి ఓటే వేస్తున్నామో కనిపిస్తుందని అన్నారు. చంద్రబాబుకు అనుకూలంగా వస్తే ఓకే..లేదంటే ఈవిఎంలపై పోరాటం చేస్తారు. ప్రజల మద్దతు తనవైపు లేదని అర్ధమై ఇప్పుడు ప్రజాతీర్పును అవహేళన చేస్తూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఈవిఎంల మీద నెపాన్ని నెడుతున్నారని జగన్‌ అన్నారు. స్ట్రాంగ్‌ రూంల భద్రతను కేంద్రానికి అప్పగించాలని జగన్‌ కోరారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/