జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

తదుపరి విచారణ డిసెంబర్ 6కు వాయిదా

cm jagan
cm jagan

హైదరాబాద్‌: ఈరోజు నాంపల్లి సీబీఐ కోర్టు ఏపి సిఎం జగన్‌ అక్రమాస్తుల కేసును విచారించింది. మొత్తం 11 ఛార్జిషీట్లకు సంబంధించి విచారణ జరిగింది. ఈ రోజు విచారణకు ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ హాజరయ్యారు. జగన్, విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితులెవరూ ఈనాటి విచారణకు హాజరుకాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కు మినహాయింపును ఇవ్వడం కుదరదని… కచ్చితంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని సీబీఐ కోర్టు 15 రోజుల క్రితం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, అధికారిక పర్యటనల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో జగన్ విచారణకు హాజరు కాలేరంటూ ఆయన తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం, తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/