విజయవాడకు వెళ్లిన జగన్‌ మోహన్‌ రెడ్డి

Jagan
Jagan

విజయవాడ: దేశ వ్యాప్తంగా ఏప్రిల్‌ 11 నుంచి మే 19 వరకు జరిగిన ఎన్నికల పోలింగ్‌ ఫలితాలు మే 23న వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు తమ సొంత నియోజకవర్గాలకు పయనమయ్యారు. మరోవైపుప పార్టీల అధినేతలు ఆయా రాష్ట్రాల రాజధానులకు తరలివెళ్లారు. ఆ రోజు మధ్యాహ్నం లోటస్‌పాండ్‌నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి విజయవాడకు వెళ్లారు. ఆయనతో పాటు పలువురు వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఉన్నారు. రేపు కౌంటింగ్‌ జరగనుండడంతో జగన్‌ విజయవాడలోని వైఎస్‌ఆర్‌సిపి ఆఫీస్‌ నుంచి పార్టీ నేతలతో కలిసి జగన్‌ ఫలితాలు వీక్షిస్తారని తెలుస్తుంది. మొత్తం 36 కౌంటింగ్‌ కేంద్రాల్లో కౌంటింగ్‌ జరగనుంది. ఈ సందర్భంగా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంనీయ సంఘటనలు జరగకుండా సాయుధ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/