ఉన్నతాధికారులతో సమావేశం కానున్న జగన్‌

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ కైవసం చేసుకున్న జగన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి చేరుకుంటున్నారు. అధినేతను కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. వీరందరినీ జగన్‌ కలిసిన తర్వాత ఆయన ఐఏఎస్‌, ఐపిఎస్‌ ఉన్నతాధికారులతో జగన్‌ సమావేశం కానున్నారు. తన ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను అధికారులకు వివరించి అందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించనున్నారు. పరిపాలనలో చేపట్టబోయే విధానలను, తీసుకురావల్సిన మార్పులను అధికారులకు జగన్‌ తెలియజేయనున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ నివాసం వద్ద పోలీసులు భద్రత పెంచారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos