రాజధాని తరలింపు అంశం న్యాయపరిధిలో ఉంది

ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సిపి వ్యవహరిస్తోంది

yanamala ramakrishnudu
yanamala ramakrishnudu

అమరావతి: ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సిపి వ్యవహరిస్తోందని టిడిపి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. రాజధాని తరలింపు, మండలి రద్దు అంశాలపై ..కేంద్రం నుంచి ముఖ్యమంత్రి జగన్‌కు సానుకూల స్పందన రాలేదని అన్నారు. రాజధాని తరలింపు న్యాయపరిధిలో ఉందనే సమధానం కేంద్రం నుంచి ఎదురైందన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగాలనేది న్యాయపరమైన అంశమని..వైఎస్సార్‌సిపి తప్ప ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారని యనమల స్పష్టం చేశారు. సెలక్ట్‌ కమిటీని అడ్డుకునేందుకు వైఎస్సార్‌సిపి అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. మండలి కార్యదర్శి కూడా చైర్మన్‌ ఆదేశాలు పాటించకుండా నియంత్రిస్తోందని ఇది సభా నియమాలకు విరుద్ధమని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలక్ట్‌ కమిటీ దస్త్రాన్ని మళ్లీ వెనక్కి పంపడం ద్వారా..కార్యదర్శి సభా నియమాల ఉల్లంఘనకు పాల్పడ్డారని యనమల విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/