విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై విజయవాడలో సియంలు భేటీ!

jagan, KCR
jagan, KCR

హైద‌రాబాద్ః ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య నెలకొన్న విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి విజయవాడ వేదిక కానుంది. ఉద్యోగులు, ఆస్తులు, అప్పులు, సంస్థల విభజనపై చర్చించేందుకు కేసీఆర్‌, జగన్‌ విజయవాడలో భేటీ కానున్నారు. ఇందుకోసం అజెండాను తయారుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ సీఎంలను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16 లేదా 17న ఆయన విజయవాడ వెళ్లనున్నారు. అప్పుడే విభజన సమస్యలపైనా ఇద్దరు సీఎంలు చర్చిస్తారని, అందుకోసం వివరాలు సిద్ధంగా ఉంచాలని తెలంగాణ సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.