ఏపి కేబినెట్‌లో జగనే అత్యంత ధనికుడు

Y S jagan
Y S jagan, ap cm

అమరావతి: ఏపి రాష్ట్ర కేబినెట్‌లో అత్యంత సంపన్నుడు సియం వై ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడిఆర్‌) వెల్లడించింది. రాష్ట్ర మంత్రి వర్గంలోని 28 మంది ఇటీవల ఎన్నికల్లో సమర్పించిన ప్రమాణ పత్రాలను పరిశీలించిన ఆ సంస్థ మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది.
రూ 510 కోట్ల ఆస్తులతో జగన్‌ అందరికంటే ముందు వరుసలో ఉండగా, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(130కోట్లు), మేకపాటి గౌతంరెడ్డి(61 కోట్లు) ఉన్నారు. 26 మంది మంత్రుల్లో 23 మంది కోటీశ్వరులే. మంత్రుల సగటు ఆస్తి విలువ 35.25 కోట్లు. మంత్రులలో 17 మందిపై క్రిమినల్‌ కేసులుండగా, 9 మందిపై తీవ్రమైన నేరాభియోగాలున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/