వివేకా హత్యను జగన్‌ రాజకీయం చేస్తున్నారు

అమరావతి : నేడు జరిగిన ఓ మీడియా సమవేశంలో టిడిపి నేత రామయ్య మాట్లాడుతూ,వైఎస్‌: వివేకానంద రెడ్డి హత్యకు గల కారణాలు జగన్‌ కు తెలుసని ,ఆత్మహతగా చిత్రికరించే యత్నం చేశారని వెల్లడించారు.వివేకాకు అర్థరాత్రి 1.30 గంటలకు ఓ మహిళ నుంచి మెసేజ్‌ వచ్చిందని ,మీ కూతురు వల్ల మా జీవితం నాశనం అయిందని ,దానికి తగిన శిక్ష అనుభవిస్తావని ఆ మెసేజ్‌ లో ఉందని తెలిపారు. హత్యను జగన్‌ రాజకీయం చేస్తున్నారని వాస్తవాలు బయటకు రాకుండా చేయడానికే సీబీఐ విచారణ కోరుతున్నారని ఆరోపించారు.తెలంగాణ సీఎం కెసిఆర్‌ ఆమోదం తెలిపిన అభ్యర్థుల్నే జగన్‌ ప్రకటించారని చేప్పారు.జైల్లో ఉండాల్సిన వ్యక్తి ఎన్నికల బరిలో ఉన్నాడంటూ జగన్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

https://www.vaartha.com/andhra-pradesh
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: