సిట్‌పై సోద‌రికి ఉన్న విశ్వాసం, జ‌గ‌న్‌కు లేదు

varla ramaiah
varla ramaiah


అమరావతి: వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌పై సోదరి సునీతకు ఉన్న విశ్వాసం జగన్‌కు లేకుండా పోయిందని ఆర్టీసీ ఛైర్మన్‌ వర్ల రామయ్య దుయ్యబట్టారు. శవ రాజకీయాలకు వైఎస్ఆర్‌సిపి పెట్టింది పేర‌ని విమర్శించారు. గతంలో వైఎస్ మరణం, ఇప్పుడు వివేకా హత్య ద్వారా సానుభూతి పొందాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి మరణాన్ని రాజకీయం చేయొద్దని వివేకా కుమార్తె చెప్పింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ శవ రాజకీయం చేస్తున్నాడని తెలిసే వివేకా కుమార్తె వేడుకొందని చెప్పారు.