జగన్‌ నీచ సంస్కృతి అర్థమవుతుంది

Bonda Uma
Bonda Uma

విజయవాడ: టిడిపి ఎమ్యెల్యె బోండా ఉమామహేశ్వరరావు ఈరోజు మీడియాతో మాట్లాడుతు వైఎస్‌ఆర్‌సిపి పార్టీ అధ్యక్షుడు జగన్‌కి ఓట్ల తొలగింపుపై ఏమైనా అనుమానాలు ఉంటే ఏపి ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేయాలని, తెలంగాణలో ఎందుకు పిర్యాదు చేశారని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల డేటాకు సంబంధించిన కార్యాలయంపై తెలంగాణ ప్రభుత్వం దాడి చేసి.. డేటాను బలవంతంగా తీసుకుని గిఫ్ట్‌గా వైఎస్‌ఆర్‌సిపి కి ఇచ్చిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టే జగన్.. ఆయన మిత్రులు కెసిఆర్‌ , మోడి లకు ప్రజాక్షేత్రంలో శిక్ష పడుతుందని బోండా ఉమా హెచ్చరించారు.