శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ సోదాలపై నివేదిక

income tax department
income tax department

అమరావతి: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో గత కొన్ని రోజులుగా ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ తనిఖీలకు సంబంధించి దాడుల్లో పట్టుబడిన సొమ్ము వివరాలు పేర్కొంటూ ఐటీ అధికారులు పంచనామా నివేదికను విడుదల చేశారు. ఈ సోదాల్లో రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఐటీశాఖ పేర్కొంది. మరోవైపు శ్రీనివాస్ ఇంట్లో రూ.2 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఐటీ పంచనామా నివేదిక తేల్చింది. అంతేకాదు సోదాల అనంతరం పంచానామా నివేదికపై శ్రీనివాస్‌, ఐటీ అధికారుల సంతకాలు చేసినట్లు నివేదికలో ఉంది. శ్రీనివాస్‌ నివాసంలో ఐటీశాఖ అధికారులు పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారని రెండ్రోజుల నుంచి ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే తాజా పంచనామా నివేదికతో ఆ ఆరోపణలు అవాస్తమని ఐటీ నివేదిక ద్వారా వెల్లడైంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/