పెన్షన్‌ ఎత్తివేసిన ఘనత వైస్సార్‌సిపి పభుత్వానిదే

వికలాంగులు, వృద్ధుల పింఛన్‌ ఎత్తివేయడం బాధాకరం

alapati raja
alapati raja

గుంటూరు: వైఎస్సార్‌సిపి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శలు గుప్పించారు. అమ్మమ్మ, తాతయ్యల పెన్షన్ ఎత్తేసిన ఘనత వైఎస్సార్‌సిపి ప్రభుత్వానికే దక్కుతుందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో 2వేల పెన్షన్ ఇస్తే.. వైఎస్సార్‌సిపి సర్కార్ 2,250కు పెంచి వికలాంగులు, వృద్ధుల పింఛన్ ఎత్తేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి నుంచి వార్డుల్లో పర్యటించి పెన్షన్లు పోయిన వారి వివరాలు సేకరిస్తామని తెలిపారు. రాజధానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. మూడు రాజధానులు చేసే అవకాశం లేదని కేంద్రం కూడా స్పష్టం చేసిందని గుర్తుచేశారు. సెలెక్ట్ కమిటీ నివేదిక వచ్చే వరకూ రాజధాని మార్పు చేయకూడదని కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయన్నారు. వాటిని ధిక్కరిస్తే రాజ్యాంగ విరుద్ధం అవుతుందన్నారు. రైతులు, పేదల పొట్ట కొట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆలపాటి రాజా ధ్వజమెత్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/