నింగిలోకి వెళ్లనున్న పిఎస్‌ఎల్‌వి-సి48

కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌

PSLV - C48
PSLV – C48

నెల్లూరు: నేడు నింగిలోకి పిఎస్‌ఎల్‌వి-సి48 వాహన నౌకను పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్దం చేశారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోటలో ఉన్న షార్‌ కేంద్రం నుంచి బుధవారం మధ్యాహ్నం 3.25 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగానికి ముందు జరిగే కౌంట్‌డౌన్‌ ప్రక్రియను నిన్న సాయంత్రం 4.40 గంటలకు ప్రారంభించారు. వాస్తవానికి ఈ కౌంట్‌డౌన్‌ 4.25 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ రాహుకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించారు. అయితే ప్రయోగ సమయాన్ని మాత్రం మార్చలేదు. యథావిధిగా ముందుగా నిర్ణయించుకున్నట్లుగా బుధవారం మధ్యాహ్నం 3.25 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి48 వాహననౌకను నింగిలోకి పంపనున్నారు. పిఎస్‌ఎల్‌వి-సి48 వాహననౌక మనదేశానికి చెందిన రీశాట్‌-2బిఆర్‌1తో పాటు విదేశాలకు చెందిన ఇతర 9 ఉపగ్రహాలను నిర్ణీతకక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/