గంటా శ్రీనివాసరావు కు బ్యాంకు నోటీసులు

Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao

విశాఖపట్టణం: ఏపీ మాజీ మంత్రి టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తులు వేలానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 20న వేలం నిర్వహించాలని బ్యాంకు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రత్యూషా రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేర ఇండియన్‌ బ్యాంకు నుంచి భారీ రుణం తీసుకొని ఎగవేసిన కేసులో ఆస్తులు వేలం వేస్తున్నట్లు ఇండియన్‌ బ్యాంక్‌ తెలిపింది. రుణ బకాయిలు సుమారు రూ.209 కోట్ల కాగా..తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ.35 కోట్ల 35 కోట్లు అని బ్యాంక్‌ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా గంటా ప్రభుత్వ భూములు తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే వేలం కానున్న ఆస్తుల్లో ఎమ్మెల్యే గంటా పేరిట ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఫ్లాట్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేలం పాటకు సంబంధించి గంటా శ్రీనివాసరావు స్పందిచాల్సి ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/