స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా 24 శాతం తగ్గించారు

బీసీలకు చట్టసభల్లో ప్రాతినిథ్యం లేకుండా చేస్తున్నారు

yanamala ramakrishnudu
yanamala ramakrishnudu

అమరావతి: బీసీ నాయకత్వాన్ని అణగదొక్కి, చట్టసభల్లో ప్రాతినిథ్యం లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని టిడిపి సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా 24 శాతానికి తగ్గించి వెనకబడిన కులాలకు ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం ద్రోహం చేసిందని విమర్శించారు. బీసీలకు రాజకీయ అవకాశాలను రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావితం చూపేందుకు జగన్‌ ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగిస్తుందని వ్యాఖ్యానించారు. డబ్బు, అధికార బలంతో ఓటర్లను, ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్‌ తుగ్గక్‌ నిర్ణయాలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని యనమల తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/