తుపాను ప్రభావం: విజయనగరం

Impact of storm in  VizianagaramImpact of storm in  Vizianagaram
Impact of storm in Vizianagaram

విజయనగరం: జిల్లాలో పెథాయ్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. భారీ ఈదురు గాలులు భయాందో్ళనలు కలిగిస్తున్నాయి. పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చింతపల్లి బీచ్ వద్ద సముద్రం 50 అడుగులు ముందుకు చొచ్చుకువచ్చింది. ఎప్పుడు మత్స్యకారులు, పర్యాటకులతో కళకళలాడే సాగర తీరం వెలవెలబోతోంది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. సముద్ర ఒడ్డుకు ఎవరూ రాకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. తుపాను తాకిడికి రైతులు విలవిల్లాడుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో పెథాన్ తుపాను తమ పొట్ట కొడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పార్వతీపురం, సాలూరులో అరటి చెట్లు నేలకూలాయి. మన్యం ప్రాంతంలో పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలాయి.