ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటాం

29 న రేషన్‌ సరుకులు అందజేస్తాం
తెల్లరేషన్‌ కార్డుదారులందరికి ఉచితంగా రేషన్‌…
మంత్రి కొడాలి నాని స్పష్టీకరణ

kodali nani
kodali nani

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడం జరిగంది. దీనిని అదునుగా తీసుకుంటున్న వ్యాపారస్తులు సొమ్ముచేసుకుంటున్నారు. ప్రజలకు అవసరమయిన నిత్యవసర ధరలు పెంచేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. రాష్ట్రంలో ఎవరైన నిత్యవసరాల ధరలు పెంచినట్లయితే వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటమని, అవసరమయితే జైలుకు కూడా పంపిస్తామని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్‌ కు ప్రజలంతా సహకరించాలని అన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ నెల 29 న తెల్ల రేషన్‌ కార్డుదారులందరికి ఉచితంగా రేషన్‌ సరుకులు ఇస్తామని మంత్రి అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/