అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు

Nara Bhuvaneshwari
Nara Bhuvaneshwari

అమరావతి: ఉల్లిపాయల ధరలపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉల్లి ధరల తగ్గింపునకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంత భారీ స్థాయిలో ఉల్లి ధరలు పెరగడం మొదటిసారిగా చూస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఉల్లి సామాన్య ప్రజలకు ఆర్థిక భారంగా మారిందన్నారు. కాగా హెరిటేజ్‌ ఫ్రెష్‌లో అధిక ధరలకు ఉల్లిపాయలను అమ్ముతున్నారంటూ అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌సిపి నేతలు చేసిన ఆరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె స్పందించారు. అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఎందుకంటే నేను అసెంబ్లీ సమావేశాలను చూడను. హెరిటేజ్‌ ఫ్రెష్‌ ఇప్పుడు మాకింద లేదని హెరిటేజ్‌ ఫ్రెష్‌ ప్యూచర్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో నడుస్తోందని ఆమె తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/