ఆ మాధ్యమంలో చదువుకున్నందుకు సిగ్గు పడుతున్నా

తిరుపతి సమావేశంలో పవన్‌

Pawan kalyan
Pawan kalyan

తిరుపతి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తెలుగు వైభవం-తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశం తిరుపతిలో నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ల నియోజకవర్గాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. తాను ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నందుకు సిగ్గుపడుతున్నానని ఆయన అన్నారు. తెలుగు కవుల రచనలను కార్యశాలలు నిర్వహించేందుకు మన నుడి-మన నది కార్యక్రమం లక్ష్యం అని ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలుగు భాష నిర్లక్ష్యం కావడానికి తరతరాలుగా వ్యవస్థను పాలిస్తున్న నాయకుల నిర్లక్ష్యం కారణమని పవన్‌ వ్యాఖ్యానించారు. ఆంగ్ల మాధ్యమమే గొప్ప అయితే, అది చదివిన వారు ఎందుకు అవినీతికి పాల్పడి జైల్లకు వెళ్లారు అని ఆయన ఈ సందంర్భంగా ప్రశ్నించారు. ఏపిలో ఒడియా, తమిళం, బెంగాళీ, ఉర్దు, కన్నడ మాధ్యమాలు భోదించే పాఠశాలలు కూడా ఉన్నాయని, వాటిని వదిలేసి తెలుగు మాధ్యమం వెనకాల ఎందుకు పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలుగు భాష జోలికి వస్తే సహించేది లేదని మరోసారి స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/