జూలై 14న దుర్గమ్మకు బంగారు బోనం, పట్టువస్త్రాలు

indrakeeladri
indrakeeladri


హైదరాబాద్‌: భాగ్యనగర మహాంకాళి అమ్మవారి ఆలయం తరఫున బెజవాడ కనకదుర్గమ్మకు వచ్చేనెల 14న బంగారు బోనం, పట్టు వస్త్రాలను సమర్పిస్తామని భాగ్యనగర శ్రీ మహాకాళి అమ్మవారి జాతర, బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు తెలిపారు. తెలు గు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవాలని, పాడి పంటలతో రెండు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పదేళ్లుగా హైదరాబాద్‌ పాతబస్తీ నుంచి సామూహిక బోనాలు బెజవాడ కనకదుర్గమ్మకు సమర్పిస్తున్నట్లు ఆయన కమిటీ బృందం దుర్గగుడి ఈఓ కోటేశ్వరమ్మకు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/